పుట్లూరు: మండలంలోని ఏ.కొండాపురం వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిరంజన్ (20) మృతి చెందాడు. స్థానికుల వివరాలమేరకు.. పుట్లూరు మండలం అరకటివేములకు చెందిన మీసాల నాగేంద్ర కుమారుడు నిరంజన్ పెద్దపప్పూరు మండలం అమ్మలదిన్నె గ్రామానికి వెళ్లి కారులో తిరిగి బయలుదేరారు. అయితే ఏ. కొండాపురం వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీ కొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిరంజన్‌ను వెంటనే తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


