‘కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో
ద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కరలీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘనిర్‌ఝర
ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్’
.. అంటూ మహాభారత నాటకంలో ద్రౌపదీ వస్త్రాపహరణ సన్నివేశంలో భీముడి పాత్రధారిగా రామాంజనేయులు రాగయుక్తంగా, ఆవేశంగా ఆలపిస్తుంటే ప్రేక్షకులు మైమరిచిపోతుంటారు. భీమసేనుడి కోపతీవ్రతనూ, అతని ప్రతిజ్ఞలోని భయంకరత్వాన్నీ ప్రేక్షకుల మనస్సుకు హత్తుకుని ‘వన్స్‌మోర్’ అనే కేకలతో రంగస్థలం ప్రతిధ్వనిస్తుంది.


