రాయలసీమ ద్రోహి చంద్రబాబు
అనంతపురం ఎడ్యుకేషన్: తన శిష్యుడు రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్న తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను అటెక్కించడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ‘సీమ’ ద్రోహిగా నిలిచిపోయారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తన పలుకుబడి, తాను పెట్టిన ఒత్తిడి వల్ల ఏపీ సీఎం చంద్రబాబు తలొగ్గి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని గుర్తు చేశారు.
ఓటుకు నోటుకు భయపడే ఇదంతా..
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ఆ కేసుకు భయపడే నోరు విప్పలేదని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉపయోగించుకునే హక్కును కూడా వదులుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడంలో చంద్రబాబు అనేక సందర్భాల్లో తనకే తానే సాటి అని రుజువు చేసుకున్నారన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పుతున్నానంటూ చెప్పుకునే ఆ రోజుల్లో కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచుతున్నా కనీసం నోరు మెదపలేదన్నారు. 854 అడుగుల ఎంపీడీఎల్ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో 830 అడుగులకు కుదించారన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని సరిచేస్తే అప్పట్లో దేవినేని ఉమా ‘ప్రకాశం బ్యారేజీ’పై ధర్నా చేశారన్నారు. దాని ఫలితంగా 2014లో అధికారంలోకి రాగానే ఆయనను ఇరిగేషన్ మంత్రిని చేశారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయినా వరుణదేవుడు కరుణిస్తే తప్ప పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ నుంచి పూర్తిస్థాయి సామర్థ్యంలో నీటిని తీసుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డితో కుమ్మకై ్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలనే చంద్రబాబు చర్యలను ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంలో ఈ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తుంగభద్ర నుంచి సమాంతర కాలువ తీసుకొచ్చి హంద్రీ–నీవాకు అనుసంధానం చేయాలని కోరారు. శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టుల్లో పూడిక వల్ల దాదాపు 200 టీఎంసీల నీటిని కోల్పోతున్నామన్నారు. ఆ మేరకు డ్యాంల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైఎస్సార్‌సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, అనంతపురం, రాప్తాడు మండలాల కన్వీనర్లు బండి పవన్, దుగుమర్రి గోవిందరెడ్డి, సాకే వెంకటేష్, రాప్తాడు యూత్ కన్వీనర్ విశ్వనాథరెడ్డి, నాయకులు మీనుగ నాగరాజు, ఈశ్వరయ్య, జూటూరు శేఖర్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట
రేవంత్‌రెడ్డితో కుమ్మకై ్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాడు
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం


