ఏ ప్రభుత్వమైనా సరే పన్ను వసూళ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇలా ప్రజల నుంచి పన్ను రూపంలో వసూలు చేసిన మొత్తంతోనే అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తుంది. ఈ విషయంలో ఎవరు అలక్ష్యం చేసినా సహించే పరిస్థితి ఉండదు. కానీ రాయలసీమ మున్సిపల్‌ ప్రాంతాల్లో | - | Sakshi
Sakshi News home page

ఏ ప్రభుత్వమైనా సరే పన్ను వసూళ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇలా ప్రజల నుంచి పన్ను రూపంలో వసూలు చేసిన మొత్తంతోనే అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తుంది. ఈ విషయంలో ఎవరు అలక్ష్యం చేసినా సహించే పరిస్థితి ఉండదు. కానీ రాయలసీమ మున్సిపల్‌ ప్రాంతాల్లో

Jan 7 2026 7:32 AM | Updated on Jan 7 2026 7:32 AM

ఏ ప్ర

ఏ ప్రభుత్వమైనా సరే పన్ను వసూళ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తు

అనంతపురం క్రైం: మున్సిపాలిటీల్లో పన్నుల వసూలు చతికిలపడింది. సకాలంలో వసూలు కాకపోవడంతో రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీ, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితి నెలకొంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి మొత్తం రూ.4,765.63 కోట్ల పన్ను వసూళ్లు లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటి వరకు 50 శాతం కూడా దాటకపోవడం గమనార్హం. జిల్లాలోని ఒక నగరపాలక సంస్థ, ఐదు మున్సిపాలిటీల పరిధిలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.135.82 కోట్ల పన్నుల వసూలు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 36.09 శాతంతో రూ.49.01 కోట్లు మాత్రమే వసూలైంది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది. ప్రజలపై పన్నుల భారం పెడుతూ, వసూళ్లలో అలసత్వం వహించిన పాలకుల వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పన్నుల వసూలు అధ్వానం

అనంతపురం జిల్లాలోని స్థానిక సంస్థ (మున్సిపాలిటీ)ల్లో పన్నుల వసూళ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాలు పరిశీలిస్తే.. వసూళ్ల తీరు విస్తు గొలుపుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం డిమాండ్‌ రూ.135.83 కోట్లు ఉండగా, ఇప్పటివరకు వసూలైన మొత్తం రూ.49.02 కోట్లు మాత్రమే. అంటే ఆర్థిక సంవత్సరం ముగింపునకు మూడు నెలలే మిగిలి ఉన్నా, వసూళ్ల సాధన కేవలం 36.09 శాతానికే పరిమితం కావడం గమనార్హం. ఇది సాధారణ ఆలస్యం కాదు, వ్యవస్థాగత వైఫల్యానికి ప్రత్యేక నిదర్శనం.

కళ్యాణదుర్గం.. మరీ అధ్వానం

పన్నుల వసూళ్లలో జిల్లాలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చాలా అధ్వానంగా ఉంది. రూ.2.04 కోట్ల వసూళ్లతో చివరి స్థానంలో నిలిచింది. గుత్తి, రాయదుర్గం మున్సిపాలిటీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి.

ఇవి అనంతపురం నగర పాలక సంస్థలోని చెత్త తరలింపు వాహనాలు. ఇంటింటి నుంచి చెత్త సేకరించి డంపింగ్‌ యార్డుకు చేర్చాల్సిన ఈ వాహనాలు గత డిసెంబర్‌ 16 నుంచి ఇలా నగరపాలక సంస్థ ముందే ఉండిపోయాయి. ఏమైందని ఆరా తీస్తే డీజిల్‌కు డబ్బులేదని తెలిసింది. దీంతో కాలువలు తీసి ఇళ్ల ముందు వేసిన చెత్త కుప్పలను తరలించే వారు లేక వీధులన్నీ దుర్వాసన వెదజల్లుతున్నాయి. పన్ను వసూళ్లు వేగవంతమైతే నగరపాలక సంస్థ ఖజానాకు నిధులు చేరి.. అభివృద్ధి పనులు చేసే వీలుంటుంది. కానీ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవడం లేదు.

పన్ను వసూలు కాక.. డీజిల్‌కు డబ్బులేక..

రాయలసీమలో చతికిల..

మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు అంతంతే..

లక్ష్య సాధనలో అట్టడుగున అనంతపురం జిల్లా

సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపమే కారణం

ఏ ప్రభుత్వమైనా సరే పన్ను వసూళ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తు1
1/2

ఏ ప్రభుత్వమైనా సరే పన్ను వసూళ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తు

ఏ ప్రభుత్వమైనా సరే పన్ను వసూళ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తు2
2/2

ఏ ప్రభుత్వమైనా సరే పన్ను వసూళ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement