అనంతపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్వహించే పశువులు, జీవాల సంతల్లో వస్తున్న ఆదాయానికి భారీగా గండిపడుతోంది. రుసుము రెట్టింపు చేశారు. అయినా క్రయవిక్రయాలు తగ్గిందేమీ లేదు. మరి ఆదాయం భారీగా పెరగాలి. కానీ రికార్డుల్లో రుసుము పెంచనప్పుడు ఎంత ఉందో అంతే స్థాయి | - | Sakshi
Sakshi News home page

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్వహించే పశువులు, జీవాల సంతల్లో వస్తున్న ఆదాయానికి భారీగా గండిపడుతోంది. రుసుము రెట్టింపు చేశారు. అయినా క్రయవిక్రయాలు తగ్గిందేమీ లేదు. మరి ఆదాయం భారీగా పెరగాలి. కానీ రికార్డుల్లో రుసుము పెంచనప్పుడు ఎంత ఉందో అంతే స్థాయి

Jan 8 2026 7:00 AM | Updated on Jan 8 2026 7:00 AM

అనంతప

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్వహించే పశువులు,

ప్రతి ఆదివారం జరిగే పశువులు, ఎద్దులు, గేదెల సంతలో రద్దీ

అనంతపురం అగ్రికల్చర్‌: ప్రతి శని, ఆది వారాల్లో అనంతపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పశువులు, జీవాల సంత నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి జీవాలను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో సర్కారు కొలువుతీరిన వెంటనే అంటే 2024 జూలై నుంచి మార్కెట్‌యార్డులో జరిగే పశువులు, జీవాల సంతల్లో రుసుం పెంచారు. దీంతో రైతులు, కాపర్లు, వ్యాపారులపై భారం పడింది. 2024 జూన్‌ వరకు ప్రతి శనివారం జరిగే గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంతలో క్రయ విక్రయాలు జరిగే ప్రతి జీవానికి రూ.30 చొప్పున వసూలు చేస్తుండగా, దాన్ని రూ.50కు పెంచేశారు. ఆదివారం జరిగే పశువులు, ఎద్దులు, గేదెల సంతలో ఒక్కో దానికి రూ.100 ఉండగా దాన్ని ఏకంగా రూ.200 చేసేశారు. కానీ వసూళ్లకు వచ్చే సరికి గతంతో పోల్చినప్పుడు తేడా కనిపించడం లేదు. పాలకవర్గం నియమించకుండా జాప్యం చేయడంతో ‘సంతల్లో సడేమియా’ అన్న చందంగా ఆదాయం దారి మళ్లించేశారు.

సాధారణ రుసుముతోనే పెరుగుదల..

ఏటా ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణించి సంతల్లో వచ్చిన వసూళ్లు లెక్కిస్తారు. ఈ లెక్కన చూస్తే జీవాలకు రూ.30, పశువులకు రూ.100 ప్రకారం పాత రుసుం పరిగణనలోకి తీసుకుంటే 2021–22లో శనివారం జరిగే జీవాల సంత నుంచి రూ.85.87 లక్షలు వసూలు కాగా.. ఆదివారం జరిగే పశువుల సంత ద్వారా రూ.59.20 లక్షలు సమకూరింది. అలాగే 2022–23లో జీవాల సంతల నుంచి ఏకంగా రూ.98.74 లక్షలు కాగా.. పశువుల సంత ఆదాయం రూ.41.68 లక్షలు వచ్చింది. పశువుల సంతలో ఆదాయం తగ్గడానికి కారణం జిల్లా వ్యాప్తంగా లంపీస్కిన్‌ డిసీసెస్‌ (ముద్ద చర్మవ్యాధి) ప్రబలడంతో అక్టోబర్‌ నుంచి జనవరి నెలాఖరు వరకు పశువుల సంతను పూర్తిగా బంద్‌ చేయడమే. ఇక 2023–24లో జీవాల సంతల నుంచి ఏకంగా రూ.1.05 కోట్లు వసూలు కాగా.. పశువుల సంత నుంచి రూ.91.01 లక్షల ఆదాయం వచ్చింది. ఇలా గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో అనంతపురం మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా ఏకేఎస్‌ ఫయాజ్‌ ఉన్న కాలంలో వసూళ్లు పెరుగుతూ వచ్చాయి.

రెట్టింపు రుసుముతో ఆదాయం పెరగదా..?

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మార్కెట్‌ రుసుము బాగా పెంచారు. పశువుల సంతలో రూ.100 నుంచి రూ.200కు రెట్టింపు చేయగా, జీవాల సంతలో కూడా రూ.30 నుంచి రూ.50కు పెంచారు. ఈ లెక్కన ఆదాయం రెట్టింపు రావాలి. అలా కాకున్నా గతంలో కన్నా కనీసం 50 శాతం పెంపు తప్పనిసరిగా ఉండాలి. వాస్తవ పరిస్థితి చూస్తే... ‘నాడు–నేడు’ వసూళ్లకు తేడా కనిపించడం లేదంటే సొమ్ము పక్కదారి పడుతోందని పక్కాగా అర్థమవుతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జీవాల సంత ద్వారా రూ.1.14 కోట్లు, పశువుల సంత ద్వారా రూ.92 లక్షలు వసూలైంది. మార్కెట్‌ రుసుము మామూలుగా ఉన్న 2023–24లో రెండు సంతల ద్వారా రూ.1.96 కోట్లు వసూలు కాగా.. రుసుము పెంచిన తర్వాత 2024–25లో రెండింటి ద్వారా రూ.2.06 కోట్లు వసూలవడం గమనార్హం. ‘నాడు–నేడు’ మధ్య రూ.10 లక్షలు మాత్రమే తేడా కనిపిస్తోంది. ఇక ఈ ఏడాది (2025–26)లో కూడా రూ.2 కోట్లకు కాస్త అటు ఇటుగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

● చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన 20 నెలల తర్వాత అనంతపురం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ఏర్పాటవుతోంది. మరి ఈ నూతన కమిటీ సభ్యులయినా రుసుము వసూళ్లు, సంస్థ ఆదాయంపై దృష్టి సారిస్తారా.. లేదంటే సొమ్ము దారి మళ్లింపును కొనసాగిస్తారా అనేది వేచిచూడాలి.

పెంచిన రుసుంతో సంతలో వసూలు చేస్తున్న మార్కెట్‌యార్డు ఉద్యోగులు (ఫైల్‌)

పశువులు, జీవాల సంతల ఆదాయానికి భారీగా గండి

చంద్రబాబు సర్కారు కొలువుదీరగానే రుసుము పెంపు

మార్కెట్‌యార్డుకు మాత్రం ఆ స్థాయి ఆదాయం కనిపించని పరిస్థితి

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్వహించే పశువులు,1
1/2

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్వహించే పశువులు,

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్వహించే పశువులు,2
2/2

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్వహించే పశువులు,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement