జిల్లా అంతటా బుధవారం పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి.
గణతంత్ర వేడుకలకు
పకడ్బందీ ఏర్పాట్లు
అనంతపురం అర్బన్: గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్‌డే) ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవం నిర్వహణపై ఇన్‌చార్జ్ కలెక్టర్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26న నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమ నిర్వహణకు అసిస్టెంట్ కలెక్టర్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారన్నారు. ప్రొటోకాల్ ఏర్పాట్లను చేపట్టాలని ఆర్డీఓను ఆదేశించారు. జాతీయ సమైక్యత ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను అవార్డుల కోసం ఆయా శాఖల అధికారులు ఎంపిక చేయాలన్నారు. ఈ క్రమంలో వివాదాలకు, విమర్శలకు తావు లేకుండా చూసుకోవాలన్నారు. కలెక్టరేట్ నుంచి డీఆర్‌ఓ మలోల, ఏఎస్పీ రియాజ్‌బాషా, ఆర్డీఓ కేశవనాయుడు, డీఈఓ ప్రసాద్‌బాబు, సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప, డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, కో–ఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రీ–సర్వే వేగవంతం చేయాలి
భూముల రీ–సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. రీ–సర్వే పీజీఆర్‌ఎస్, ఏపీ సేవా సర్వీస్, ఆర్‌ఓఆర్, జాతీయ రహదారులు, ప్రాజెక్టులకు భూసేకరణ, పౌర సరఫరాలు, తదితర అంశాలపై ఇన్‌చార్జ్ కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ నుంచి డీఆర్‌ఓ మలోలతో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే భూ రికార్డుల శాఖ ఏడీ రూప్లానాయక్, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు తదిరులు పాల్గొన్నారు.


