బాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారు
గుంతకల్లు: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మకై రాయలసీమకు నీరు అందకుండా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే జరుగుతోందన్నారు. కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు సాగు, తాగునీటిని అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకు తెలంగాణ సీఎం వద్ద తాకట్టు పెటారన్నారు. ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి సాక్షాత్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించడంతో బాబు బండారం బట్టబయలైందన్నారు. గతంలో బాబు సీఎంగా ఉన్నప్పడు ఆయన చేతిగానితనంతోనే కర్ణాటకలో ఆల్మటి ఎత్తును అక్కడి ప్రభుత్వం పెంచిందన్నారు. దీంతో రాయలసీమకు రావాల్సిన నీటి వాటా కోల్పోయినట్లైందన్నారు. గతంలోనూ కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని, నేడు ఎత్తిపోతుల పథకాన్ని నీరుగార్చరాని మండిపడ్డారు.
గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్


