ఆస్తి పన్ను పెంపు అసంబద్ధం : సీపీఎం
గుంతకల్లు టౌన్: పట్టణాల్లో ఆస్తి పన్ను పెంపు అసంబద్ధంగా ఉందని, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై కోట్లాది రూపాయల భారాన్ని మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప అన్నారు. ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం చేపట్టిన ప్రజా పోరుయాత్రను సోమవారం ఆయన గుంతకల్లులో జెండా ఊపి ప్రారంభించారు. ఆస్తి పన్నులను 20 శాతం పెంచేలా త్వరలో చేపట్టనున్న సర్వేను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి మారుతి, నాయకులు నాగరాజు, సురేంద్ర, రంగమ్మ, తిమ్మప్ప, ఓబులేసు పాల్గొన్నారు.
అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసుకోండి
బుక్కరాయసముద్రం: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సులకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని రెడ్డిపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర తెలిపారు. 2025–25 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలకు ఈ నెల 28 నుంచి https://angrau.ac.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు రెడ్డిపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించాలన్నారు.


