ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి
గర్భిణులే కాదు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం లాంటివి లేక బీపీ, షుగర్ బాధితులు పెరుగుతున్నారు. తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గర్భిణులు తప్పక షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. నిర్ధారణ అయితే బిడ్డకు సోకకుండా రక్షించుకోవచ్చు. జాగ్రత్తలు తీసుకోవచ్చు. గర్భం ధరించినప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగినట్లు కనిపించినా ప్రసవం తర్వాత చాలామందిలో మటుమాయం అవుతుంది. ముఖ్యంగా ఆహారపు నియమాలతో పాటు వ్యాయామం చేయాలి. – ఈబీ దేవి,
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి


