వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకుల నియామకం
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులను నియమిస్తూ ఆ పార్టీ కేంద్రం కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్సీ బోరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి, హిందూపురం పరిశీలకులుగా ఆర్ రమేష్‌రెడ్డి నియమితులయ్యారు.
శింగనమల సమన్వయకర్తగా సాకే శైలజానాథ్
శింగనమల: వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సమన్వయకర్తగా సాకే శైలజానాథ్‌ను నియమించడంతో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.
చెర్లోపల్లి – తిరుపతి
మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దష్ట్యా చెర్లోపల్లి – తిరుపతి మధ్య వయా వికారబాద్, గుంతకల్లు, కడప మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి గురు, శుక్రవారాల్లో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. మే 8వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ రాకపోకలు ఉంటాయని పేర్కొన్నారు. చెరోపల్లి నుంచి ఈ రైలు (07257) 8వ తేదీ (గురువారం) సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు తిరుపతి జంక్షన్‌కు చేరుతుందన్నారు. తిరిగి అదే రైలు (07258) అదే రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి శనివారం తెల్లవారుజూమున 4.30 గంటలకు చెర్లోపల్లి జంక్షన్‌కు చేరుతుందన్నారు. ఈ రైలు సనత్‌నగర్, లింగంపల్లి, వికరాబాద్, తాండూరు, సేదం, యాద్గిరి, కృష్ణ, రాయాచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రాజంపేట, రేణుగుంట మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు.
ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక చర్యలు
గుంతకల్లు: రైలు ప్రయాణికుల భద్రతకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో లగేజ్ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. పేలుడు పదార్థాలు, గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర ప్రమాదకర వస్తువుల రవాణాను అరికట్టేందుకు ఈ స్కానర్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు. అంతేకాక రైల్వేస్టేషన్‌తోపాటు పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకుల నియామకం
వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకుల నియామకం
వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకుల నియామకం


