● విద్యార్థిని భార్గవికి ఎంఈవోల అభినందన
విద్యార్థిని భార్గవిని అభినందిస్తున్న ఎంఈవోలు సత్యనారాయణ, శేఖర్
కె.కోటపాడు : జిల్లా స్థాయిలో జరిగిన సైన్స్ సెమినార్ పోటీల్లో ఎ.కోడూరు హైస్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని అనకాపల్లి భార్గవి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ నెల 18న జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు కశింకోటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎనర్జీ బాస్కెట్–2047 అంశంపై సైన్స్ సెమినార్‌ను నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాలో గల 24 మండలాల నుంచి 48 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఉత్తమ ప్రదర్శనతో ఎ.కోడూరు పాఠశాలకు చెందిన విద్యార్థిని భార్గవి మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఈమెకు నిర్వాహకులు ప్రశంసాపత్రం అందించి జ్ఞాపికతో సత్కరించారు.వీటితో పాటు ఈ నెల 23, 24లలో రాష్ట్ర స్థాయిలో విజయవాడలో జరిగే సైన్స్ సెమినార్ పోటీలకు విద్యార్థిని భార్గవి ఎంపికై ంది. దీంతో సోమవారం పాఠశాలలో విద్యార్థిని భార్గవిని ఎంఈవో–1, 2 కె.సత్యనారాయణ, ఎ.శేఖర్ అభినందించారు. కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు సూర్రెడ్డి బాబూరావు, మాధవితో పాటు పీడీలు కె.చిట్టిప్రసాద్, తమ్మునాయుడు పాల్గొన్నారు.


