తుమ్మపాల : ఈవీఎం గోడౌన్ వద్ద సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గొడౌన్‌ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆమె తనిఖీ చేశారు. గొడౌన్ పరిసరాల్లో సీసీ కెమెరాల పనితీరు, ప్రధాన ద్వారానికి ఉన్న సీల్స్, భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలకు సంబంధించిన లాగ్‌బుక్‌లో సంతకం చేశారు. గోడౌన్‌న్‌లో భద్రపరిచిన ఈవీఎంల స్థితిగతులను ఎన్నికల విభాగం అధికారులు కలెక్టర్‌కు వివరించారు. భద్రతా ప్రమాణాలు, లాగ్‌బుక్ నిర్వహణ తదితర అంశాలపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ చర్చించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్‌వో సమావేశం
నెలవారీ సమావేశాల్లో భాగంగా జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు సోమవారం తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా నవీకరణ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవల్ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలపై చర్చించి, రానున్న ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఇన్‌చార్జి ఆర్డీఓ వై.శ్రీనివాసరావు,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జూలో కృష్ణ
నేను కృష్ణను. వయసు నలభై ఎనిమిదేళ్లు. నా జీవితంలో 39 ఏళ్లగా విశాఖ జూలోనే ఉంటున్నాను. మీరు నన్ను చూడగానే భయపడతారని తెలుసు. కానీ నా కథ వింటే మీ మనసు మారొచ్చు. నేను పుట్టింది ఏ అడవిలోనో, ఎప్పుడో గుర్తు లేదు. తెలిసొచ్చేసరికి ఇక్కడే ఉన్నాను. మా జాతి పేరు ఎలిఫాస్ మాక్సిమస్ అని పిలుచుకుంటారు. మేం పూర్తి శాకాహారులం. చెట్ల బెరడు, కాండం, పండ్లు, గ్రాసం.. ఇదే మా ఆహారం. మీరు నమ్మరేమో, రోజుకి 265 కిలోల వరకు తింటా..అరటి దవ్వ, గడ్డి, చెరకు, పుచ్చకాయలు, రాగి, కేటిల్ ఫీడ్, బెల్లం...ఇంకా 150 లీటర్ల నీళ్లు తాగుతాను. నా తొండం ఒక్కసారికి పది లీటర్ల నీళ్లు పీల్చుకోగలదు, తెలుసా? – ఆరిలోవ
బ్రేక్‌ఫాస్ట్ : రాగి సంగటి
అనధికార బాణసంచా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
అనకాపల్లి : అనకాపల్లి పోలీస్‌శాఖ సబ్ డివిజన్ పరిధిలో అనధికార బాణసంచా కేంద్రాలుపై ప్రత్యేక దృష్టి సాదించడం జరిగిందని ఇన్‌ఛార్జ్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు అన్నారు. స్థానిక గవరపాలెం, రాజుపాలెం, ఎరుకువానిపాలెం, వల్లూరు, జాతీయరహదారి తోటాడ జంక్షన్ బాణసంచా దుకాణాలను పట్టణ, రూరల్ సీఐలు జి.ప్రేమ్‌కుమార్, ఆశోక్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు, భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక పరికరాలు, లైసెన్సుల వివరాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎలాంటి అనుమతులు లేకుండా గృహాలు మధ్యలో గానీ, జనావాసాల్లో గానీ బాణాసంచా తయారు చేసినా, అక్రమంగా నిల్వ ఉంచినా, అమ్మకాలు చేపట్టినా వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు (లైసెన్స్) పొందిన తయారీ, నిల్వ కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా నిర్దేశిత భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. నిల్వ కేంద్రాల వద్ద అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా అనధికారికంగా బాణాసంచా నిల్వ ఉంచినా లేదా విక్రయాలు జరిపినా ప్రజలు డయల్ 112, స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ రవికుమార్ పాల్గొన్నారు.


