భావితరాలకు స్ఫూర్తి గురజాడ సాహితీ సంపద | - | Sakshi
Sakshi News home page

భావితరాలకు స్ఫూర్తి గురజాడ సాహితీ సంపద

Sep 22 2026 12:36 AM | Updated on Sep 22 2026 12:36 AM

● మహాకవి 164వ జయంతి వేడుకల్లో కలెక్టర్‌ విజయకృష్ణన్‌

తుమ్మపాల: గురజాడ వెంకట అప్పారావు రచనలు, సాహిత్యం శాశ్వతంగా నిలిచిపోతాయని, ఆయన సాహితీ సంపదను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయం వీసీ హాల్‌లో నిర్వహించిన మహాకవి గురజాడ 164వ జయంతి వేడుకల్లో గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువైన సాహిత్యాన్ని పరిరక్షించడంతో పాటు వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశమంటే మట్టికాదోయ్‌ – దేశమంటే మనుషులోయ్‌.. అంటూ గురజాడ అందించిన సందేశం విశ్వవ్యాప్తంగా దేశభక్తికి స్ఫూర్తినిస్తోందన్నారు. గురజాడ రచించిన ‘కన్యాశుల్కం’ గొప్ప సామాజిక స్ప్రహకు నిదర్శనమన్నారు. మానవతా దృక్పథం, సామాజిక చైతన్యం, సమాజంలోని సమస్యలపై గురజాడ చేసిన సాహితీప్రస్థానం నేటికీ ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి విజయ్‌కుమార్‌తో పాటు కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement