● రాష్ట్ర బాలికా అభివృద్ధి అధికారి జయలక్ష్మి
వంటల నాణ్యత పరిశీలిస్తున్న విజయలక్ష్మి
మాకవరపాలెం: ఇంటర్, పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా బోధన సాగించాలని రాష్ట్ర బాలికా అభివృద్ధి అధికారి పి.జయలక్ష్మి ఆదేశించారు. స్థానిక కేజీబీవీని సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వంట చేసే ప్రాంతం, పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. పది, ఇంటర్ విద్యార్థినులతో మాట్లాడారు. మెనూ అమలు, తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల సిబ్బందితో సమీక్షించారు. వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థినులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలికా అభివృద్ధి అధికారి జెమీమా పాల్గొన్నారు.


