డీసీఈబీ కార్యదర్శిగా నూకరాజు | - | Sakshi
Sakshi News home page

డీసీఈబీ కార్యదర్శిగా నూకరాజు

Aug 19 2026 12:18 AM | Updated on Aug 19 2026 12:18 AM

నక్కపల్లి: డీసీఈబీ(జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు) కార్యదర్శిగా మండలంలోని దేవవరం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేమగిరి నూకరాజు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. 26 ఏళ్ల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఆయన గతంలో మండల విద్యాశాఖాధికారిగా పనిచేశారు. నూకరాజు పనితీరును గుర్తించి విద్యా శాఖ డీసీఈబోర్డు కార్యదర్శిగా నియమించింది. ఈ నియామకం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని నూకరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement