రావికమతం : మండలంలో కవ్వుగుంట పంచాయతీ బుడ్డిబంద గ్రామంలో వీ–బీజీ పథకం ద్వారా ఉపాధి పనులు కల్పించాలని గ్రామానికి చెందిన గిరిజనులు మంగళవారం కంచాలు చేతపట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. గ్రామంలో పస్తుతం వీఆర్‌పీ లేకపోవడంతో మాకు ఉపాధి పనులు కల్పించలేదు.. ప్రతి కుటుంబానికి పభుత్వం 125 రోజులు పని కల్పించాలి, కానీ ఉపాధి పనులు కల్పించలేదని గిరిజనులు వాపోయారు. గ్రామంలో 181 ఎకరాల భూమి ఉంది. వరి ఆకుపోతలు వేసి ఉన్నాము. వర్షాలు లేకపోవడంతో వరి నారు మడులు ఎండిపోతున్నాయి. పెద్దేరు రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో భూములు ఉన్నాయి. పెద్దేరు నీరు విడుదల చేసినప్పటికి నీరు రాలేదు. వర్షాలు లేకపోవడంతో ఈ సంవత్సరం పంటలు పండే పరిస్థితి కనబడడం లేదు. కనీసం ఉపాధి పనులు కల్పించాలని పలుమార్లు కోరినప్పటికీ పనులు కల్పించలేదు.. మా పంచాయతీకి వీఆర్‌పీని నియమించి, మాకు ఉపాధి పనులు కల్పించాలని వేడుకున్నారు. లేని పక్షంలో సోమవారం రావికమతం ఎంపీడీవో కార్యాలయం వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె.గోవిందరావు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో గిరిజనులు, రైతులు పాల్గొన్నారు.
ఉపాధి పనుల కోసం గిరిజనుల వేడుకోలు


