అర్జీదారు సమస్యలను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 64 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల సమస్యలు తెలుసుకుంటూ దరఖాస్తులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు, ఆస్తి గొడవలు, ఆర్థిక మోసాలు, భార్యాభర్తల వేధింపులు, గృహ కలహాలు, శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై 64 అర్జీలు వచ్చాయన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తొంగకుండా కేవలం నిజాల ఆధారంగా పారదర్శకంగా దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. స్టేషన్‌లో కేసులు ఏ దశలో ఉన్నాయో బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిలో నమ్మకం నింపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, ఎస్‌బీ సీఐ ఎస్.బాలసూర్యారావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


