గరిశింగిలో భారీ గిరినాగును పట్టుకుంటున్న వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులు
దేవరాపల్లి: మండలంలోని గరిశింగిలో సోమవారం ఉదయం భారీ గిరినాగు జనావాసాల మధ్యకు ప్రవేశించి గ్రామస్తులను హడలెత్తించింది. గ్రామంలోని రెండు ఇళ్ల మధ్య సందులో సుమారు 12 అడుగుల మేర పొడువున్న గిరినాగు చేరింది. ఇటుకలు తీసేందుకు వెళ్లగ ఒక్కసారిగా గిరినాగు పడగ విప్పి బుసలు కొట్టడంతో స్థానిక ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. వెంటనే స్థానికులు చోడవరం అటవీశాఖ అధికార్లు ద్వారా తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులకు సమాచారం అందించారు. ప్రసాద్, కృష్ణ, ఇషాక్ తదితర సమితి సభ్యులు అక్కడికి చేరుకొని సుమారు గంట పాటు శ్రమించి అతి కష్టం మీద భారీ గిరినాగును సురక్షితంగా పట్టుకున్నారు. చీడికాడ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.


