వ్యవసాయ సంక్షోభం నుంచి కాపాడండి | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ సంక్షోభం నుంచి కాపాడండి

Aug 18 2026 12:21 AM | Updated on Aug 18 2026 12:21 AM

ఆర్డీవో అయేషాకు వినతిపత్రం అందజేస్తున్న రైతు సంఘం నాయకులు

అనకాపల్లి టౌన్‌ : తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ సంక్షోభం నుంచి రైతాంగాన్ని రక్షించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపిల్లి అప్పలరాజు అన్నారు. స్ధానక ఆర్డీవో కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్డీవో అయేషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రైతుల పెట్టుబడులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని, ఖరీఫ్‌లో తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని కోరారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులు, కౌలు రైతులకు రూ. 50వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్‌ నాయకులు వై.ఎన్‌. భద్రం, కోన లక్ష్మణ్‌, రైతు సంఘం నాయకులు కాసుబాబు, కోరుబిల్లి శంకర్రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement