విశాఖ రైల్వే స్టేషన్‌లో జీఎం పర్యటన | - | Sakshi
Sakshi News home page

విశాఖ రైల్వే స్టేషన్‌లో జీఎం పర్యటన

Aug 18 2026 12:21 AM | Updated on Aug 18 2026 12:21 AM

ఏఐ ఆధారిత సహాయక సిస్టంను పరిశీలిస్తున్న జీఎం సందీప్‌ మాధుర్‌

తాటిచెట్లపాలెం (విశాఖ): సౌత్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాధుర్‌ సోమవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో పర్యటించి తనిఖీలు నిర్వహించారు. విశాఖ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌ బోహ్రాతో కలిసి స్టేషన్‌లోని పలు విభాగాలను పరిశీలించారు. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత ‘సారిక’ సహాయక వ్యవస్థ పనితీరును పరిశీలించారు. దీని ద్వారా స్టేషన్‌లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, వెయిటింగ్‌ హాళ్లు, రిజర్వేషన్‌ కౌంటర్లు తదితర వివరాలను ప్రయాణికులు తెలుసుకోవచ్చు. వ్యవస్థ పనితీరును పరిశీలించిన జీఎం పలు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement