మహారాణిపేట: జిల్లాకు కొత్తగా వచ్చిన రెండు ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ శ్రీభరత్ శనివారం పోలీస్ బ్యారెక్స్ వద్ద ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి మొత్తం 20 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గాజువాక నుంచి, విమానాశ్రయం నుంచి గంటకో బస్సు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రూ.300, గాజువాక నుంచి రూ.400 చార్జీగా నిర్ణయించారు. అనంతరం మంత్రి, ఎంపీతోపాటు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చి తదితరులు బస్సులో ఆర్కే బీచ్ వరకు ప్రయాణించారు.


