ఘనంగా ముగిసిన గ్రామీణ యువజన మందిరం వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ముగిసిన గ్రామీణ యువజన మందిరం వార్షికోత్సవం

Aug 16 2026 4:39 AM | Updated on Aug 16 2026 4:39 AM

మునగపాక: గ్రామీణ యువజన మందిరం వార్షికోత్సవం శనివారం రాత్రితో ఘనంగా ముగిసింది. ఇందులో భాగంగా నందీశ్వర ప్రాంగణం తులసీ కళావేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువజన మందిరం ద్వారా ఒకవైపు క్రీడా పోటీలు, మరోవైపు నాటక రంగ కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలతోపాటు క్రీడలు, నాటక పరిషత్‌లు నిర్వహించి రాష్ట్రంలో మరింత గుర్తింపువచ్చేలా కృషి చేయాలన్నారు. ఐ కిడ్స్‌ అకాడమి వారిచే కూచిపూడి, భరతనాట్యం, బాల రామాయణం వంటి ప్రదర్శనలు నిర్వహించారు. అయిదు రోజులుగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మందిర అధ్యక్షుడు ఆడారి శ్రీకాంత్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్రీడా విభాగం మండల కన్వీనర్‌ పెంటకోట విజయ్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు విల్లూరి నరసింగరావు, మాజీ అధ్యక్షుడు దాడి ముసిలినాయుడు, విద్యావేత్త పెంటకోట వెంకటరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు, గవర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ భీమరశెట్టి శ్రీనివాసరావు, మందిర ఉపాధ్యక్షులు మళ్ల సంజీవరావు, మళ్ల రామజగన్నాథం, ఆడారి లక్ష్మణరావు, మందిర మాజీ అధ్యక్షులు ఆడారి గంగమహేష్‌, ఆడారి సూర్యచంద్రరావు, ఆడారి రమణబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement