రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు

Aug 16 2026 4:39 AM | Updated on Aug 16 2026 4:39 AM

పోలీసులు స్వాధీనం చేసుకున్న పొక్లెయిన్‌

నాతవరం: రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన తారురోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు స్థానిక ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ నాతవరం నుంచి తాండవ వరకు రూ.3.50 కోట్లతో ఇటీవల అఽర్‌అండ్‌బీ శాఖ తారురోడ్డు నిర్మించింది. పంట పొల్లాల్లోకి వాహనాలు వెళ్లడానికి, తాండవ నీరు తరలించేందుకు రోడ్డు మార్జిన్‌ చమ్మచింత పంచాయతీ పరిధిలో సింహాలు రైస్‌మిల్లు వద్ద ఇదే గ్రామానికి చెందిన దొరబాబు పొక్లెయిన్‌తో తవ్వేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. తారురోడ్డుపై ఐరన్‌ చక్రాలతో దమ్ము చేసే ట్రాక్టర్లు తిరిగితే కేసు పెడతామన్నారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా దమ్ము చేసే ట్రాక్టర్ల యజమానులకు నోటీసులు పంపినట్టు ఎస్‌ఐ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement