పూడిమడకను విభజించాలని వినతి
అచ్చుతాపురం రూరల్ : అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీని రెండు పంచాయతీలుగా ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. 20 వేల జనాభా ఉన్న గ్రామాన్ని పూడిమడక, కడపాలెం గ్రామ పంచాయతీలుగా విభజించాలని, అత్యధిక జనాభా కారణంగా పరిపాలన భారం పెరిగి అభివృద్ధి జరగడం లేదని తెలిపారు.కడపాలెం, కొండపాలెం, ఎస్సీ కాలనీ, పళ్ళిపేట, పెద్దురు, జాలరిపాలెం గ్రామాలు ఒకే పంచాయతీలో కొనసాగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అధికారులు చొరవ తీసుకుని పుడిమడక ప్రజలకు మెరుగైన సేవల కొసం ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందించారు.
ఆర్‌డీఓ షేక్ ఆయిషాకు రెండు పంచాయితీలు కోరుతూ వినతిపత్రం అందజేస్తున్న పూడిమడక ప్రజలు
పూడిమడకను విభజించాలని వినతి


