ఆస్పత్రి ప్రాంగణంలో ఆటస్థలమా..?
నాతవరం : స్ధానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కూటమి నేతలు, అధికారులు కుమ్మకై ్క పీహెచ్‌సీ ప్రాంగణంలో ఆటస్థలం పనులు చేపట్టడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని జెడ్పీటీసీ సభ్యురాలు కాపారపు అప్పలనర్స, నాతవరం సర్పంచ్ గొలగాని రాణి, ఉప సర్పంచ్ కరక అప్పలరాజు తెలిపారు. పీజీఆర్‌ఎస్‌లో సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన అర్జీ అందజేసి, అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాతవరం పీహెచ్‌సీకి 1960లో దాత మూడు ఎకరాలు జిరాయితీ భూమి ఇచ్చారన్నారు. ఆ భూమిలో ఆస్పత్రి భవనాలు నిర్మించాలని దాతలు కోరారన్నారు. ఇటీవల ప్రభుత్వం ఆట స్థలం నిర్మాణం కోసం రూ.4 లక్షలు మంజూరు చేయడంతో సర్పంచ్‌కు, పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీకి గానీ సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఆస్పత్రి ప్రాంగణంలో ఆట స్థలం నిర్మాణ పనులు ప్రారంభించారన్నారు. దీనిపై ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ వేణుగోపాల్, మండల ప్రత్యేకాధికారి మంగవేణికి స్వయంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఆస్పత్రి స్థలంలో ఆటస్థలం నిర్మిస్తే పీహెచ్‌సీ అప్‌గ్రేడ్‌కు స్ధల సమస్య వస్తుందన్నారు. దీనిపై పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ మండల శాఖ అద్యక్షుడు చెక్కా జోగిరాజు, నాతవరం మాజీ వైస్ సర్పంచ్‌రాంబాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు అపిరెడ్డి మహేష్ పాల్గొన్నారు.


