
స్కూలా.. టీడీపీ కార్యాలయమా?
గంజాయి తరలింపుపై డ్రోన్‌తో నిఘా
గొలుగొండ: స్థానిక ఎంపీపీ పాఠశాలకు ఇరువైపులా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల కటౌట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గొలుగొండ మండలం చోద్యం సహకార బ్యాంక్ పర్సన్ ఇన్‌చార్జిగా నియమితులైన చిటికెల సాంబమూర్తి ప్రమాణ స్వీకారం సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్ చింతకాయల రాజేష్‌ను ఆహ్వానిస్తూ ఈ కటౌట్లు ఏర్పాటు చేయడంపై విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలకు 50 మీటర్లు దూరంలోనే ఎంఈవో కార్యాలయం ఉన్నా ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం.