
30న కల్లుగీత కార్మికుల సమస్యలపై నిరసన
మాట్లాడుతున్న ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యర్రా దేముడు
అనకాపల్లి టౌన్: కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏపీ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యర్రా దేముడు డిమాండ్ చేశారు. స్థానిక ప్రైవేటు హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వృత్తి సమయంలో కల్లుగీత కార్మికులు చనిపోతే రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా, గాయపడితే రూ.3 లక్షలు ఇవ్వాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా వెలసిన బెల్ట్‌షాపుల వల్ల కల్లు గీత కార్మికులు రోడ్డున పడ్డారని వాపోయారు. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వమే నీరా కేప్‌లు పెట్టాలన్నారు. పలు సమస్యల పరిష్కారానికి ఈ నెల 30న జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో కట్టా ఈశ్వరరావు, గండిబోయిన రాము, జుత్తిక రాము, కొలుసు మహలక్ష్మీనాయడు తదితరులు పాల్గొన్నారు.