సొమ్మొకరిది... సోకొకరిది..! | - | Sakshi
Sakshi News home page

సొమ్మొకరిది... సోకొకరిది..!

Aug 22 2025 3:22 AM | Updated on Aug 22 2025 3:22 AM

సొమ్మ

సొమ్మొకరిది... సోకొకరిది..!

10లో

న్యూస్‌రీల్‌

భారీ చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్‌
విశాఖ షీలానగర్‌లో జూలై 13న జరిగిన దొంగతనం కేసును నగర క్రైం పోలీసులు ఛేదించారు.

ఉచిత బస్సుకోసం పాట్లు..ఫీట్లు

ఫ్రీ బస్‌ ఎక్కేందుకు మహిళలు క్యూ కట్టారు..రద్దీలో బస్సెక్కడానికి

పాట్లు పడ్డారు.

శుక్రవారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2025

ఆర్‌ఈసీఎస్‌ అనుబంధ పాలిటెక్నిక్‌ కళాశాలపై ఈపీడీసీఎల్‌ శీతకన్ను

హెచ్‌సీ కుమార్తెకు కారుణ్య నియామకం

ఆర్‌ఈసీఎస్‌ కార్యకలాపాలు చేతికి వచ్చాక సంస్థ ఆస్తులు, మిగులు నిధులపై ఈపీడీసీఎల్‌ పెత్తనం

రూ.కోట్ల ఆదాయం తీసుకుంటూ కళాశాల నిర్వహణ గాలికి..

కారుణ్య నియామక పత్రాన్ని అందజేస్తున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి : జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఇటీవల మృతి చెందిన డిస్ట్రిక్ట్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వు హెడ్‌ కానిస్టేబుల్‌ ఈశ్వరరావు కుమార్తె శిరీషకు జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ హోదాలో కారుణ్య నియామక పత్రంను గురువారం తమ కార్యాలయంలో ఎస్పీ తుహిన్‌ సిన్హా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగం పట్ల అంకితభావం, నిజాయితీతో కృషి చేస్తూ కుటుంబానికి, పోలీస్‌ శాఖకు గౌరవం తీసుకురావాలని కోరారు.

ఏడు నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించని వైనం

సాక్షి, అనకాపల్లి :

శింకోటలో గల ఆర్‌ఈసీఎస్‌ సంస్థకు సంబంధించి రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆర్‌ఈసీఎస్‌ పరిధిలో గల ఐదు మండలాల వినియోగదారుల బకాయిల చెల్లింపులు కోట్ల రూపాయలు ఏపీఈపీడీసీఎల్‌ బ్యాంక్‌ ఖాతాలో ఉన్నాయి. ఏపీఈపీడీసీఎల్‌ ఆర్‌ఈసీఎస్‌ విలీన ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగలేదు..సంస్థ కార్యకలాపాల వరకే అప్పగించాలని ఏపీఈఆర్‌సీ ఆదేశించింది. సంస్థ ఆస్తుల, అప్పుల సెటిల్‌మెంట్‌ జరిగే వరకు ఆ సంస్థ అనుబంధ పాలిటెక్నిక్‌ కళాశాల నిర్వహణ బాధ్యత ఈపీఆర్‌సీ ఆదాయంతోనే చూసుకోవాలని స్పష్టంగా ఉంది. ఏపీఈఆర్‌సీ వారి ఆదేశాల మేరకు ఆర్‌ఈసీఎస్‌ సంస్థకు విద్యుత్‌ పంపిణీ కార్యక్రమాలకు లైసెన్స్‌ లేని కారణంగా ఆస్తులు, అప్పుల సెటిల్మెంట్‌ను పెండింగ్‌లో ఉంచి సంస్థ కార్యకలాపాలను ఏపీఈపీడీసీఎల్‌ వారిని తక్షణం స్వాధీనం చేసుకోవాలని జారీ చేసింది. కానీ ఏపీఈఆర్‌సీ వారి ఆదేశాలకు విరుద్ధంగా ఆర్‌ఈసీఎస్‌ సంస్థకు సంబంధించి సుమారు 2 కోట్ల రూపాయల మిగులు నిధులను, రూ. 6.5 కోట్ల విలువ గల స్టోర్స్‌ మెటీరియల్‌ను ఏపీఈపీడీసీఎల్‌ వారు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటుగా కళాశాల మిగులు నిధులు సుమారు రూ.2.28 కోట్ల రూపాయలను కూడా స్వాధీన పరుచుకున్నారు. ఉద్యోగులను, కార్యాలయాలను వాడుకుంటూ వ్యాపారం చేస్తున్న ఏపీఈపీడీసీఎల్‌ సంస్థ కళాశాల పూర్తి బాధ్యతను మాత్రం తీసుకోవడం లేదు. 16 ఏళ్లుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచిన ఈ కళాశాలకు కూటమి ప్రభుత్వంలో ఆటంకం ఏర్పడింది. కళాశాల సిబ్బందికి సుమారు ఏడాదిగా జీతాలు లేవు..కళాశాల నిర్వహణ బాధ్యత ఏపీఈసీడీసీఎల్‌ తీసుకోకుండా ఆర్‌ఈసీఎస్‌ ఆదాయాన్ని మాత్రం లాగేసుకుంటున్నది. ఆర్‌ఈసీఎస్‌ బకాయిలు చెల్లింపులు, ఆదాయం మొత్తం సొంతం చేసుకుంటూ అనుబంధ పాలిటెక్నిక్‌ కళాశాల నిర్వహణ బాధ్యతను, అందులో పనిచేసే సిబ్బందికి జీతాలు చెల్లింపులను పట్టించుకోవడం లేదంటూ కళాశాల సిబ్బంది, విద్యార్థులు వాపోతున్నారు.

ఆర్‌ఈసీఎస్‌ నేపథ్యమిదీ...

అనకాపల్లి జిల్లాలో ఐదు మండలాల పరిధిలో గల గ్రామాల్లో గృహ, వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార అవసరాల నిమిత్తం 50 ఏళ్ల క్రితమే విద్యుత్‌ సరఫరా కార్యకలాపాలను ప్రారంభించిన అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ(ఆర్‌ఈసీఎస్‌) వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ పంపిణీ చేస్తూ లాభాల బాటలో పయనించింది. అన్ని రంగాలలో కలిపి ఆర్‌ఈసీఎస్‌ సంస్థకు సుమారు 2 లక్షల పైచిలుకు వినియోగదారులు ఉన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో వినియోగదారుల పిల్లలకు సాంకేతిక విద్యను అందించాలనే దూరదృష్టితో డిప్లొమా కోర్సులతో పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. 2008లో సెప్టెంబర్‌లో వినియోగదారులతో జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించి కశింకోటలో రాజీవ్‌ గాంధీ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేశారు. కళాశాలకు సంస్థ ప్రధాన కార్యాలయంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాకుండా కళాశాల నిర్వహణ బాధ్యత, ఉద్యోగుల జీతభత్యాలు, భవన నిర్మాణాలు, ప్రయోగ పరికరాల కొనుగోలు, ఇతర నిర్వహణ ఖర్చులు ఆర్‌ఈసీఎస్‌ నిధుల నుంచి చెల్లించాలని తీర్మానం చేశారు. సంస్థ బైలాను కూడా సవరించి 2009లో రాజీవ్‌గాంధీ ఆర్‌ఈసీఎస్‌ పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభించారు.

వినియోగదారుల పిల్లలకు సగం సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఆర్‌ఈసీఎస్‌ యాజమాన్యం కల్పించిన మౌలిక సదుపాయాలతో 120 మంది విద్యార్థులతో కళాశాల ప్రారంభమై అనతి కాలంలోనే 720 మంది విద్యార్థులకు విద్య అందించే స్థాయికి ఎదిగింది. ఇప్పటివరకూ వేలాది మంది విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించి స్థిరపడేలా కృషి చేసింది. .

పలుమార్లు వినతి..

స్థానిక కూటమి ఎమ్మెల్యేకు, ఏపీఈపీడీసీఎల్‌కు, జిల్లా కలెక్టర్‌కు కళాశాల సిబ్బంది పలుమార్లు వినతి ఇచ్చినా ఫలితం లేకపోయింది. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లే ఉంటున్నారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పీజీపీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

కశికోటలో గల ఆర్‌ఈసీఎస్‌ –పాలిటెక్నిక్‌ కళాశాల, విద్యార్థులు

ఆదాయం ఏపీఈపీడీసీఎల్‌ ఖాతాకు..

2021 సెప్టెంబర్‌ నుంచి 2025 మే వరకూ మధ్యకాలంలో విద్యుత్‌ వినిమయ బిల్లుల బకాయిల చెల్లింపులు రూ.574.32 కోట్ల ఆదాయం రాగా ..సిబ్బంది జీతాలు, రికరింగ్‌, నాన్‌ రికరింగ్‌ ఖర్చుల చెల్లింపు నిమిత్తం రూ.171.35 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 402.96 కోట్ల నగదును ఈపీఆర్‌సీ బ్యాంకు ఖాతాలో జమచేయాల్సి ఉంది. కానీ ఏపీఈపీడీసీఎల్‌ వారి ఖాతాలలో జమ చేసుకున్నారు. సంస్థ ఆస్తులు అప్పులపై హక్కు, అధికారం వినియోగదారులది. సంస్థకు రూ.వందల కోట్లు ఆస్తులు ఉన్నాయి. కానీ ఏపీఈఆర్‌సీ వారి ఆదేశాలకు విరుద్ధంగా మిగులు నిధులను, సంస్థ పంపిణీ వ్యవస్థను, కార్యాలయాలను, ఉద్యోగులను వాడుకుని వ్యాపారం చేసుకుంటూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ఏపీఈపీడీసీఎల్‌, కళాశాల నిర్వహణ బాధ్యత మాత్రం తీసుకోవడం లేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మానవత్వం పరిమళించిన వేళ...

ఎంపికై న విద్యార్థి సాత్విక్‌

కూటమి ప్రభుత్వం వచ్చాక మొదలైన కష్టాలు

గణపతి మండపాలకు అనుమతులు తప్పనిసరి

ఇంతవరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోనే...

ఏపీఈపీడీసీఎల్‌ సంస్థ పంపిణీ వ్యవస్థను, ఉద్యోగులను, కార్యాలయాలను వాడుకుంటూ వ్యాపారం చేస్తున్న ఏపీఈపీడీసీఎల్‌ వారు ఆర్‌ఈసీఎస్‌ సంస్థ రికరింగ్‌, నాన్‌–రికరింగ్‌ ఖర్చులను చెల్లిస్తున్నారు .కానీ..కళాశాల రికరింగ్‌, నాన్‌–రికరింగ్‌ ఖర్చులను భరించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సిబ్బందికి జీతాలు లేవు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించినా వాటితో కళాశాల నిర్వహణ నడిచేది. కానీ 2023–24, 2024–25 విద్యాసంవత్సరాలకు ప్రభుత్వం ఫీజురియింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు. దీంతో వినియోగదారులు పిల్లలు (విద్యార్థుల) భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది.

సొమ్మొకరిది... సోకొకరిది..! 1
1/4

సొమ్మొకరిది... సోకొకరిది..!

సొమ్మొకరిది... సోకొకరిది..! 2
2/4

సొమ్మొకరిది... సోకొకరిది..!

సొమ్మొకరిది... సోకొకరిది..! 3
3/4

సొమ్మొకరిది... సోకొకరిది..!

సొమ్మొకరిది... సోకొకరిది..! 4
4/4

సొమ్మొకరిది... సోకొకరిది..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement