
పలు చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు
అనకాపల్లి టౌన్: పలు చోరీ కేసులలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. స్ధానిక డిఎస్‌పి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చోడవరం మండలం తిమ్మన్నపాలెం గ్రామంలో ఈ నెల ఏడు నుంచి 18వ తేదీ వరకు ఐదు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన నిందితుడు కన్నూరి విష్ణుమూర్తిని అరెస్ట్ చేసి, నుంచి నాలుగున్నర తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. జల్సాలకు అలవాటు పడ్డ ఈ యువకుడు చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతుంటాడని తెలిపారు. సమావేశంలో చోడవరం సీఐ పి.అప్పలరాజు, ఎస్‌ఐ నాగకార్తీక్, సిబ్బంది పాల్గొన్నారు.