
ముగిసిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
మునగపాక: నాగులాపల్లిలో మూడు రోజులపాటు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి మహిళలు, పురుషుల కబడ్డీ పోటీలు బుదవారం రాత్రితో ముగిశాయి. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ జన్మదినం సందర్బంగా అనకాపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దొడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. 8 జిల్లాలకు సంబందించిన మహిళలు, పురుషుల కబడ్డీ క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. కబడ్డీ ఆసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉరుకూటి శ్రీనివాసరావు ఇతర సభ్యుల సహకారంతో పోటీలు విజయవంతంగా ముగిసాయి. మహిళల విభాగంలో విశాఖ జట్టుకు ప్రథమ స్థానం, శ్రీకాకుళం జట్టుకు ద్వితీయ స్థానం దక్కాయి. విజేతలకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయకుమార్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దొడ్డి శ్రీనివాసరావు మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు.
మహిళా విభాగం విజేత విశాఖ జట్టు