
ఇకపై అర్ధరాత్రి వరకు బార్లు బార్లా...
● 1వ తేదీ నుంచి నూతన బార్ విధానం
● జిల్లాకు 10 బార్ల కేటాయింపు
● నోటిఫికేషన్ విడుదల
● 18 నుంచి 26 వరకు దరఖాస్తుల స్వీకరణ
● 28న కలెక్టరేట్‌లో డ్రా ద్వారా కేటాయింపు
అనకాపల్లి టౌన్ : కూటమి ప్రభుత్వం కొత్త బార్ పాలసీ ప్రకారం జిల్లాకు 10 బార్లు కేటాయించినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి వి.సుఽధీర్ తెలిపారు. సోమవారం కొండ కొప్పాకలో ఉన్న స్థానిక జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరుతో ప్రస్తుతం నడుస్తున్న బార్ల లైసెన్స్‌లు పూర్తవుతున్నాయని తెలిపారు. దీంతో జిల్లాలో కొత్తగా కేటాయించిన 10 కొత్త బార్లలో జీవీఎంసీ పరిధిలో 7 బార్లు, జిల్లాలో 3 బార్లు ఉన్నాయి. వీటిలో నర్సీపట్నంలో 2, యలమంచిలిలో 1 బారు కేటాయించినట్లు చెప్పారు. కొత్త బార్లకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు వెల్లడించారు. జనరల్ కేటగిరీలో బార్లకు ఈ నెల 18 నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులను కొండ కొప్పాక ఎకై ్సజ్ కార్యాలయంలో నేరుగా సమర్పించాలని సూచించారు. 28వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో డ్రా ద్వారా బార్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. దరఖాస్తుతో పాటు ధరావతు సొమ్ముగా నాన్ రిఫండబుల్ రూ.5 లక్షలు, అప్లికేషన్ ఫీజు రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక్కో బార్‌కు కనీసం 4 దరఖాస్తులు రావాలి, లేని పక్షంలో ఆ బార్‌కు డ్రా తీయడం జరగదని తెలిపారుు. సుప్రీంకోర్టు మర్గదర్శకాలకు అనుగుణంగా స్కూళ్లు, దేవాలయాలకు దూరంగా బార్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బార్ లైసెన్సు కోసం 50 వేలు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, రూ.5 లక్ష లు దాటితే రూ.75 లక్షలు చెల్లించాలి. లైసెన్సు ఫీజు ను 6 ఇన్‌స్టాల్మెంట్లలో చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లు తెలిపారు. అయితే ఒక బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బార్ నిర్వహణ సమయాన్ని రాత్రి 12 గంటల వరకు పొడిగించారు.