
నవంబర్ 30న వైజాగ్ మారథాన్
ఏయూ క్యాంపస్: వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో సంధ్య మైరెన్స్ సహకారంతో వైజాగ్ మారథాన్ నాల్గవ ఎడిషన్ నవంబర్ 30న జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సోమవారం బీచ్‌రోడ్డులోని ఒక హోటల్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 32 కి.మీ, 21 కి.మీ, 10 కి.మీ, 5 కి.మీ విభాగాల్లో పోటీలు ఉంటాయని, ఆసక్తి ఉన్నవారు వైజాగ్ మారథాన్ వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. వైజాగ్ రన్నర్స్ సొసైటీ అధ్యక్షుడు బాలకృష్ణ రాయ్ మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం ఈ మారథాన్ ముఖ్య ఉద్దేశమన్నారు. పోటీలో పాల్గొనే వారందరికీ టీషర్ట్, మెడల్, ఎనర్జీ డ్రింక్, అల్పాహారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సంధ్యా మైరెన్స్ డైరెక్టర్ కె. ఆనంద్, వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిశోర్, అపోలో హాస్పిటల్స్ సీవోవో శ్రీరామచంద్ర, దుద్దుపూడి శ్రీనివాస్, లక్ష్మీ శ్రీధర్ పాల్గొన్నారు.