
ఏలేరు కాలువలో గుర్తు తెలియని మృతదేహం
ఏలేరు కాలువలో పడవపై
గాలిస్తున్న సీఐ అల్లు స్వామినాయుడు, సిబ్బంది
కశింకోట : మండలంలోని బంగారయ్యపేట వద్ద ఏలేరు కాలువలో గుర్తు తెలియని మృత దేహాన్ని కనుగొన్నామని సీఐ అల్లు స్వామినాయుడు శుక్రవారం రాత్రి విలేకరులకు తెలిపారు. మొదట అచ్చెర్ల గ్రామం వద్ద మృతదేహం కనిపించిందని, దాన్ని వెలికి తీయడానికి సన్నాహాలు చేస్తుండగా కాలువ ప్రవాహానికి కనిపించకుండా కొట్టుకుపోయిందన్నారు. దీంతో పడవలు, డ్రోన్‌ల సహాయంతో స్థానిక యువకులు, ఎస్‌ఐ మోనోజ్‌కుమార్, పోలీసు సిబ్బంది సహకారంతో ఎట్టకేలకు బంగారయ్యపేట వద్ద మృతదేహాన్ని గుర్తించామన్నారు. అది కుళ్లిపోయి గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉందన్నారు. బహుశా కేడీ పేట వద్ద గల్లంతైన వ్యక్తిగాని , మరెవరో మృతదేహంగా భావిస్తున్నామన్నారు. ఆచూకీ తెలిసిన వారు తమ పోలీసు స్టేషన్‌లో గాని, సెల్ నెంబర్ 9440796088కు గాని సంప్రదించి వివరాలు తెలియజేయాలన్నారు..