
ఆర్‌సీడీఎస్ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి
పాయకరావుపేట : రెడ్డి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సొసైటీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన గుడిమెట్ల రాజశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్‌సీడీఎస్ అధ్యక్షుడు యర్రపురెడ్డి సురేంద్రరెడ్డి నుంచి నియమాక పత్రం అందినట్టు రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. తనకు ఆర్‌సీడీఎస్ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ఆర్‌సీడీఎస్ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి వెంగలరెడ్డికి, రాష్ట్ర అధ్యక్షుడు వై.సురేంద్రరెడ్డికి, కో ఆర్డినేటర్ వి.వి.ఎస్.ఎన్ రెడ్డి బాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.