
తిరంగా...ఘనంగా
● 75 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ
హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభిస్తున్న
సర్పంచ్ అక్కునాయుడు, హెచ్‌ఎం శేఖర్
కె.కోటపాడు : ఎ.కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు 75 మీటర్ల పొడవు గల జాతీయ జెండాతో గ్రామంలో ర్యాలీ జరిపారు. ర్యాలీని పాఠశాల నుంచి స్థానిక సర్పంచ్ బొడ్డు అక్కునాయుడు, పీఎంసీ కమిటీ చైర్మన్ కిల్లి సింహాచలంనాయుడు, హెచ్‌ఎం శేఖర్, పీఈటీ కె.చిట్టి ప్రసాద్ ప్రారంభించారు. ప్రతి విద్యార్థి దేశభభక్తిని పెంచుకోవాలని హెచ్‌ఎం శేఖర్ ఆకాంక్షించారు.