
వితంతు పింఛన్ నిలిపివేశారు..
అంగన్‌వాడీ హెల్పర్‌గా పనిచేస్తూ నెలకు రూ.7 వేలు వేతనం తీసుకుంటున్న తనను ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణిస్తూ వితంతు పింఛన్ మంజూరు చేయడం లేదని మాకవరపాలెం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన రావాడ రమణమ్మ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. వికలాంగుడైన భర్త మాణిక్యం గతేడాది నవంబర్‌లో మరణించారని, అతని పింఛన్ తనకు భర్తీ చేసి వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నా అధికారులు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని వాపోయింది. చాలా మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు సామాజిక పింఛన్ అందిస్తున్నా తనకు మాత్రం అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.