
ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి
రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తమకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారని, ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆటో కార్మికులు ధర్నా చేశారు. ఈ నెల 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణంతో తమకు బేరాలు తగ్గిపోతాయని, ఆటోల కొనుగోలు కోసం చేసిన అప్పులకు నెలనెలా ఈఎంఐలు చెల్లింపులు ఇక కష్టమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా రూ.25 వేలు వాహనమిత్ర పథకం కింద అందజేసి, ఆదుకోవాలన్నారు. పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలపై వ్యాట్ తగ్గించాలని, వడ్డీ లేని రుణాలతో రూ.4 లక్షల సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.