
తెగిపడిన విద్యుత్ వైరు మృత్యు పాశమై...
చీడికాడ : మండలంలోని జైతవరానికి చెందిన ఒక మహిళా రైతు విద్యుత్ షాకు గురై మృతి చెందినట్లు ఎస్‌ఐ బి.సతీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జైతవరం గ్రామానికి చెందిన లాలం లక్ష్మమ్మ(36) ఆదివారం ఉదయం పశువులకు మేత కోసం గడ్డి కోసేందుకు సమీప గ్రామమైన బి.సింగవరం పొలాల్లోకి వెళ్లింది. ఉదయం వెళ్లిన లక్ష్మమ్మ ఎంతకీ తిరిగి రాకపోవడం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మృతురాలి కుమారుడు పొలంలోకి వెళ్లి చూశాడు. అక్కడ తెగిపడిన విద్యుత్ వైరు మృతురాలికి అంటుకుని ఉండగా వైరును కర్రతో వేరు చేశాడు. మృతురాలి శరీరంపై విద్యుత్ షాకుతో అయిన కాలిన గాయాలు గుర్తించారు. ఘటనపై మృతురాలి భర్త కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.
విద్యుత్‌షాక్‌తో మహిళా రైతు మృతి