పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు

Sep 22 2026 12:36 AM | Updated on Sep 22 2026 12:36 AM

అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

డుంబ్రిగుడ: వైఎస్సార్‌సీపీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. స్థానిక అల్లూరి గ్రౌండ్‌లో పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్‌ అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో నిస్వార్థంగా పనిచేసే నాయకు లు, కార్యకర్తలకు అన్యాయం జరగదని చెప్పారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రతి పంచాయతీ నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళా అభ్యర్థు లను సిద్ధం చేయాలని సూచించారు. కూటమి ప్ర భుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాల్లో ఏఒక్క పథకాన్ని సక్రమంగా ప్రజలకు అందచడం లేదని మండిపడ్డారు.

ఐడీకార్డుల పంపిణీ

ఈసందర్భంగా కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. కార్డు పొందిన కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాదబీమా వర్తిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ఎంపీపీ బాకా ఈశ్వరి, జెడ్పీటీసీ చట్టారి జానకమ్మ, వైస్‌ఎంపీపీలు శెట్టి ఆనంద్‌రావు, పంచాడి లలిత, ఎంపీటీసీలు విజయ, రామరావు, అనంతగిరి అధ్యక్షుడు కొర్ర సూర్యనారాయణ, మండల కార్యదర్శులు మఠం శంకర్‌, లీలారాణి, రామునాయుడు, మాజీ జెడ్పీటీసీ మండ్యగురు శ్రీరాములు, మాజీ సర్పంచ్‌ వెంకటరావు, నాయకులు రాజరమేష్‌బోసు, బాకా సింహాచలం, తాంగుల రామదాస్‌, నరసింగరావు, చిరంజీవి, మాజీ సర్పంచ్‌లు, అను బంధ విభాగాల నాయకులు, సీనియర్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కష్టపడే కార్యకర్తలకే టికెట్లు

హుకుంపేట(డుంబ్రిగుడ): కష్టపడి, పార్టీకి బలోపేతానికి కృషి చేసే నమ్మకమైన కార్యకర్తలకే టికెట్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. మండల కేంద్రం హుకుంపేటలో మండల అధ్యక్షుడు పాంగి అనిల్‌ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వార్డు, సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కచ్చితంగా పోటీచేసి విజయం సాధిస్తారని చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారికి టికెట్‌ ఇవ్వబోమని తెలిపారు. మండలంలోని 54 బూత్‌లు ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో వీటి సంఖ్య పెరుగుతుందని చెప్పారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉందని, ముఖ్యమంతి, ఉపముఖ్యమంత్రి భయపడుతున్నాని చెప్పారు. అనంతరం కార్యకర్తలు, నాయకులకు పార్టీ గుర్తింపు కార్డులను పంపిణీ చేశా రు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్‌కుమార్‌, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవిప్రసాద్‌, వైస్‌ ఎంపీపీ జి.సుశీల, మహిళాఅధ్యక్షురాలు సమిడ పూర్ణిమ, యువజన నాయకులు రేగం శివరామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement