డ్రగ్స్‌ నిర్మూలన, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ నిర్మూలన, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి

Sep 22 2026 12:36 AM | Updated on Sep 22 2026 12:36 AM

● పకడ్బందీగా ’త్రిశూల్‌’ అమలు ● కలెక్టర్‌ నిశాంతి ఆదేశాలు

సాక్షి, పాడేరు: జిల్లాలో డ్రగ్స్‌ నియంత్రణ, గంజాయి సాగు నిర్మూలన, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కలెక్టర్‌ టి.నిశాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఎన్‌సీవోఆర్‌డీ సమావేశాన్ని నిర్వహించి, సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ త్రిశూల్‌ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, జీరో డ్రగ్స్‌, మహిళలపై అఘాయిత్యాల విషయంలో జీరో టాలరెన్స్‌, జీరో రోడ్డు ప్రమాదాల లక్ష్యంగా పనిచేయాలన్నారు.

గంజాయి సాగుపై డ్రోన్లతో నిఘా: ఎస్పీ అమిత్‌ బర్దర్‌

గంజాయి సాగుపై డ్రోన్లు, మానవ వనరులతో నిఘా పెట్టినట్టు ఎస్పీ అమిత్‌ బర్దర్‌ తెలిపారు. గతంలో గుర్తించిన 357 గ్రామాల్లో నిఘా పెంచినట్టు చెప్పారు. జి.మాడుగుల, చింతపల్లి, గూడెం కొత్తవీధి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో 92 ప్రాంతాల్లో డ్రోన్లు, మానవ వనరులతో తనిఖీ పూర్తయిందని, ఎక్కడా గంజాయి సాగు జరగడం లేదని ఆయన చెప్పారు. చైతన్యం కార్యక్రమంలో గిరిజనులు భాగస్వామ్యమవుతున్నారన్నారు. గంజాయి, డ్రగ్స్‌ రవాణాకు సంబంధించి ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద నిరోధక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటివరకు 32 మందిని గుర్తించగా, 15 డిటెన్షన్‌ ఆర్డర్లు అమలు చేశామని, 586 సస్పెక్ట్‌ షీట్లు తెరిచామని ఆయన వివరించారు. మహిళల రక్షణ చర్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement