● ఏవో మధుసూదనరావు
రైతులకు సూచనలిస్తున్న ఏవో మధుసూదనరావు
చింతపల్లి: గిరిజన రైతాంగం విధిగా ఈ–క్రాప్ నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి టి. మధుసూదనరావు అన్నారు. శుక్రవారం చౌడుపల్లి పంచాయతీ పరిధిలోని బైలుకించంగి గ్రామంలో రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఈ–క్రాప్ నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వం నుంచి అందే రాయితీలను పొందే అవకాశం ఉంటుందన్నారు. శనివారంతో గడువు ముగుస్తుందని, రైతులు ఈ ఒక్కరోజులోగా ఈ–క్రాప్ నమోదు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వి.హెచ్.ఎ. పరమేష్, రైతులు పాల్గొన్నారు.


