డ్రగ్స్‌తో భవిష్యత్తు నాశనం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌తో భవిష్యత్తు నాశనం

Aug 15 2026 12:52 AM | Updated on Aug 15 2026 12:52 AM

అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఐలు లక్ష్మణరావు, విజయ్‌కుమార్‌

ముంచంగిపుట్టు : డ్రగ్స్‌తో భవిష్యత్తు నాశనం అవుతుందని జి.మాడుగుల సీఐ ఎస్‌.లక్ష్మణరావు అన్నారు.మండల కేంద్రంలో శుక్రవారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్‌ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్‌ మహమ్మారిపై అందరూ వ్యతిరేక పోరాటాలు చేయాలని, యూనివర్సిటీ నుంచి కాలేజీ వరకు ప్రాకిన డ్రగ్స్‌ వాడకం నేడు స్కూల్‌ స్థాయి వరకు రావడం దారుణమని అన్నారు. తల్లిదండ్రులు ప్రతి రోజు పిల్లల నడవడికపై దృష్టి పెట్టాలని,మంచి చేడు మధ్య భేదాలను తెలియజేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ నాని.పోలీసులు,స్థానికులు పాల్గోన్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

హుకుంపేట: యువత గంజాయి, మద్యపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ విజయ్‌కుమార్‌ సూచించారు. శుక్రవారం మండలంలోని సూకురు ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలను ఆయన సందర్శించారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో యువత చెడు అలవాట్లకు బానిసై ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement