మొక్కలు నాటిస్తున్న రేంజర్ అప్పారావు,హెచ్‌ఎం వరలక్ష్మి
చింతపల్లి: పర్యావరణాన్ని పెంపొందించేందుకు ’నేను ఒక మొక్క’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు స్థానిక రేంజ్ అధికారి బి. అప్పారావు అన్నారు. శుక్రవారం డివిజనల్ ఫారెస్టు అధికారి వై. నరసింహిరావు ఆదేశాల మేరకు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గిడ్డి వరలక్ష్మి, అటవీ సిబ్బంది జ్యోతి, సుమిత్ర, దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


