అరకులోయ టౌన్: పట్టణంలోని మసీదు సమీప రోడ్డు నుంచి రైతుబజార్ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండల పరిషత్ నిధులు రూ. 12 లక్షలతో చేపట్టనున్న ఈ సీసీ రోడ్డు పనులను ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతతో నిర్మించాలని, సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దురియా ఆనంద్ కుమార్, డుంబ్రిగుడ వైకాపా మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్, మండల పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, మాజీ వార్డు సభ్యుడు శివ, వైకాపా నాయకులు కమిడి అశోక్ కుమార్, జన్ని నరసింహమూర్తి, కొర్రా అర్జున్‌రావు పాల్గొన్నారు.


