సాక్షి,పాడేరు : పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ డి.కృష్ణమూర్తినాయక్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనధికార డిప్యూటేషన్లు, ఉద్యోగుల వేధింపులు, పరిపాలన విధానాల ఉల్లంఘన, ఇతర దుష్ప్రవర్తనపై వైద్య ఉద్యోగులు ఫిర్యాదుపై విశాఖపట్నం ఆర్‌డీఎం అండ్ హెచ్‌ఎస్ నివేదిక ఆధారంగా ఆయనపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ కార్యదర్శి జి.వీరపాండ్యన్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సస్పెన్షన్ సమయంలో డాక్టర్ కృష్ణమూర్తినాయక్ హెడ్‌క్వార్టర్ పాడేరులోనే ఉండాలని, సమర్ధ అధికారి అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని ఈ ఉత్వర్వుల్లో ఆయన పేర్కొన్నారు.


