మహిళల ఆర్థిక స్వావలంబనలక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థిక స్వావలంబనలక్ష్యం

Jul 24 2026 1:21 AM | Updated on Jul 24 2026 1:21 AM

పీడీ జయకృష్ణ

డుంబ్రిగుడ: మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం సీ్త్రశక్తి రుణాలను అందిస్తోందని వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్‌ జయకృష్ణ అన్నారు. గురువారం మండలంలోని సాగర పంచాయతీ కిల్లోగుడలో స్వయం సహాయక సంఘాల మహిళలతో ‘మన డబ్బులు–మన లెక్కలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక లావాదేవీలు, పొదుపు, రుణాలు, లెక్కల నిర్వహణపై మహిళలకు అవగాహన కల్పించారు. మహిళల ఆర్థిక స్వాలంబనకు వెలుగు ప్రాజెక్టు నిరంతరం తోడ్పాటు అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు సీ్త్రశక్తి రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. మహిళల ఆర్థిక ప్రగతి కోసం వెలుగు ద్వారా ట్రాక్టర్లు, పవర్‌ టిల్లర్లు తదితర యంత్రాలను రాయితీపై రుణాలతో అందిస్తున్నామని వెల్లడించారు. ఆసక్తి గల రైతులు, మహిళలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా 32 సంఘాలకు చెందిన 70 మంది సభ్యులకు రూ. 1.50 కోట్ల విలువైన మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సుందరమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement