మహిళలపై హింస
హోంమంత్రికి పట్టదా?
రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తోటి మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్థితిలో హోంమంత్రి ఉండడం మహిళా సమాజానికే సిగ్గుచేటు. గుంటూరులో ఓ మహిళను వివస్త్రను చేసి టీడీపీ నేతలు దాడికి పాల్పడినట్లు ప్రచారంలో ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చినా హోంమంత్రి స్పందించకపోవడం బాధాకరం. రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరగడంతో మహిళలకు భద్రత కరువైంది.
– కురుసా పార్వతమ్మ, జిల్లా అధ్యక్షురాలు,
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం, పాడేరు


