సాక్షి, పాడేరు: పాడేరు నుంచి వడ్డాది వెళ్లే ప్రధాన ఘాట్ రోడ్డులో పలుచోట్ల పెరిగిన చెట్లు, తుప్పలు (జంగిల్) వాహనదారులను భయపెడుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఏపుగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొనడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్‌లో ప్రధానంగా యేసుప్రభువు విగ్రహం ఉన్న మలుపులో తుప్పలు, డొంకలు బాగా పెరగడంతో అది మరింత ప్రమాదకరంగా మారింది. మలుపును సూచించే హెచ్చరిక బోర్డు కూడా తుప్పలతో కప్పుకుపోయింది. ఇప్పటికై నా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి, ప్రమాదకర మలుపులలో జంగిల్ క్లియరెన్స్ పనులను వెంటనే చేపట్టాలని వాహన చోదకులు, ప్రయాణికులు కోరుతున్నారు.


