హుకుంపేట: గిరిజన రైతులు వరిని శాసీ్త్రయ పద్ధతిలో సాగు చేస్తే మంచి ఫలితాలతో పాటు అధిక దిగుబడి సాధించవచ్చని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేష్ సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని కొట్నాపల్లి పంచాయతీ కేంద్రంలో జీవన ఎరువుల వినియోగంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులతో మాట్లాడారు. వరి పొలాల్లో రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువులను ఉపయోగించాలని సూచించారు. వీటి ద్వారా నేల సారం పెరగడంతో పాటు ఆరోగ్యకరమైన పంటను పండించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయాధికారి కె. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త
ఉమామహేష్


