రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

Jul 21 2026 12:53 AM | Updated on Jul 21 2026 12:53 AM

సాక్షి, పాడేరు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ ఆందోళన వ్యక్తం చేశారు.సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు,హత్యలు,అత్యాచార ఘటనలు అధికమవడంతో మహిళలు స్వేచ్ఛగా జీవించలేని దుస్థితి నెలకొందన్నారు.టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం అత్యంత దారుణమన్నారు. బద్వేలు,గుంటూరు సంఘటనలను వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా పరిగణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారని ఆమె తెలిపారు. తమ పార్టీ అధినేత పిలుపుమేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రం పాడేరులోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఆమె తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అర కు ఎంపీ డాక్టర్‌ తనూజరాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభ ద్ర, మాజీ ఎంపీ గొడ్డెటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,చెట్టి పాల్గుణ, నాయకులు,కార్యకర్తలుపాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

అరకులోయటౌన్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం ఉదయం 10 గంటలకు పాడేరులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

గుంటూరులో మహిళను వివస్త్ర చేయడం అన్యాయం

నేడు పాడేరులో వైఎస్సార్‌సీపీ నిరసన

వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళాఅధ్యక్షురాలు పార్వతమ్మ

మత్స్యలింగం

పార్వతమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement